Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Wednesday, July 24, 2013

2వతిమోతికి1వఅధ్యాయము

1  క్రీస్తుయేసునందున్న జీవమునుగూర్చిన వాగ్దానమునుబట్టి దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగుతిమొథెయకు (శుభమని చెప్పి) వ్రాయునది. 
2  తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక. 
3  నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నా కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు, నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞుడనై యున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యూనీకేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. 
4  నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నా కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు, నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞుడనై యున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యూనీకేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. 
5  నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసికొనుచు, నా కన్నీళ్లను తలచుకొని, నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు, నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞుడనై యున్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లియైన యూనీకేలోను వసించెను, అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. 
6  ఆ హేతువు చేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. 
7  దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియనిగ్రహమునుగల ఆత్మభావమునేయిచ్చెను గాని పిరికితనముగల ఆత్మభావమునియ్యలేదు. 
8  కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమునుగూర్చియైనను, ఆయన ఖైదినైన నన్నుగూర్చియైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్తనిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము. 
9-10. మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమునుబట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తుయేసును మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడినదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో(పాలుపొందుటకు) ఆయన మనలను పిలిచెను. 
11  ఆ సువార్తవిషయములో నేను ప్రకటించువాడనుగాను అపొస్తలుడుగాను బోధకుడునుగాను నియమింపబడితిని. 
12  ఆ హేతువుచేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని, నేను నమ్మినవాని ఎరుగుదును గనుగ సిగ్గుపడను; నేను ఆయనకు అప్పగించినదానిని (రాబోవుచున్న) ఆ దినమువరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. 
13  క్రీస్తుయేసునందుంచవలసిన విశ్వాసప్రేమలు కలిగినవాడవై, నీవు నావలన వినిన హితవాక్యప్రమాణమును గైకొనుము;
14  నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మవలన కాపాడుము. 
15  ఆసియలోనివారందరు నన్ను విడిచిపోయిరను సంగతి నీవెరుగుదువు; వారిలో పుగెల్లు హెర్మొగెనే అనువారున్నారు. 
16-17. ప్రభువు ఒనేసిఫొరు ఇంటివారియందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లనుగూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేకపర్యాయములు ఆదరించెను. 
18  మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువలన కనికరము పొందునట్లు ప్రభువు అనుగ్రహించును గాక. 
    Download Audio File

2వతిమోతికి2వఅధ్యాయము

1  నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. 
2  నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము. 
3  క్రీస్తుయేసుయొక్క మంచి రాణువవానివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. 
4  రాణువవాడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. 
5  మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. 
6  పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసినవాడు. 
7  నేను చెప్పుమాటలు ఆలోచించుకొనుము; అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును. 
8  నా సువార్తప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలోనుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము. 
9  నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు. 
10  అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడ క్రీస్తుయేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. 
11  ఈ మాట నమ్మదగినది, ఏదనగా - మననాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము. 
12  సహించినవారమైతే ఆయనతోకూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును. 
13  మనము నమ్మదగనివారమైననుఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. 
14  వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరానిమాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకముచేయుము. 
15  దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగానునిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. 
16  అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి (మాటలాడు) వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. 
  17-18. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు; వారు - పునరుత్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. 
19  అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. - ప్రభువు తనవారిని ఎరుగునుఅనునదియు - ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడునుదుర్ణీతినుండి తొలగిపోవలెనుఅనునదియు దానికి ముద్రగా ఉన్నది. 
20  గొప్ప యింటిలో వెండి పాత్రలును మాత్రమే గాక కర్రవి మంటివి కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. 
21  ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును. 
22  నీవు యౌవనేచ్ఛలను విసర్జించి, 5పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 6
23  నేర్పులేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము. 
  24-26. సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును; అందువలన సాతాను తన యిష్టము నెరవేర్చుటకై చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరియెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండవలెను. 

2వతిమోతికి3వఅధ్యాయము

1  అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. 
2  ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు. 
3  అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు, 
4  ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, 
5  పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. 
6-7. పాపభరితులై నానావిధములైన దురాశలవలన నడిపింపబడి, యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలేని అవివేక స్త్రీలయొక్క యిండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరిన వారు. 
8  యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సుకలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. 
9  అయినను వారి అవివేకమేలాగు తేటపడెనో ఆలాగే వీరిదికూడ అందరికి తేటపడును గనుక వీరు ఇకను ముందుకు సాగరు. 
10  అయితే నీవు నా బోధను నా ప్రవర్తనను నా ఉద్దేశమును నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను నా ఓర్పును, 
11  అంతియొకైయ ఈకొనియ లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను, తెలిసికొనినవాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలోనుండి ప్రభువు నన్ను తప్పించెను. 
12  క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింస పొందుదురు. 
13  అయితే దుర్జనులును వంచకులును (ఇతరులను) మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు. 
14-15. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసముద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములు బాల్యమునుండి నీవెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని వాటియందు నిలుకడగా ఉండుము. 
  16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది. 

2వతిమోతికి4వఅధ్యాయము

1  దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షముతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా 
2  వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన, దీర్ఘశాంతముతోను ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. 
3  ఎందుకనగా జనులు హితబోధనుసహింపక దురద చెవులుగల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, 
4  సత్యమునకు చెవి ఇయ్యక కల్పనాకథలవైపుకు తిరుగుకాలము వచ్చును. 
5  అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. 
6  నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నా నిర్యాణ కాలముసమీపమైయున్నది. 
7  మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. 
8  ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకుమాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. 
9  నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. 
10  దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలోనీకేకు వెళ్లెను, క్రేస్కే గలతీయుకును తీతు దల్మతియకును వెళ్లిరి; 
11  లూకామాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసుకు పంపితిని. 
12-13. నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము. 
14  అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడు చేసెను, అతని క్రియలచొప్పున ప్రభువతనికి ప్రతిఫలమిచ్చును; 
15  అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. 
16  నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరు నన్ను విడిచి పోయిరి; యిది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. 
17  అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా పక్షమున ఉండినన్ను బలపరచెను గనుక నేను సింహమునోటనుండి తప్పింపబడితిని. 
18  ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోకరాజ్యమునుకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 
19  ప్రిస్కకును అకులకును ఒనేసిఫొరు ఇంటివారికిని నా వందనములు. 
20  ఎరస్తు కొరింథిలో నిలిచిపోయెను. త్రోపిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చితిని. 
21  శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము. యుబూలు, పుదే, లీను క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచునన్నారు. 
22  ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక. కృప మీకు తోడైయుండును గాక.