1 నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.
2 నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము.
3 క్రీస్తుయేసుయొక్క మంచి రాణువవానివలె నాతోకూడ శ్రమను అనుభవించుము.
4 రాణువవాడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.
5 మరియు జెట్టియైనవాడు పోరాడునప్పుడు నియమప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు.
6 పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసినవాడు.
7 నేను చెప్పుమాటలు ఆలోచించుకొనుము; అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును.
8 నా సువార్తప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలోనుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము.
9 నేను నేరస్థుడనై యున్నట్టు ఆ సువార్తవిషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడి యుండలేదు.
10 అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడ క్రీస్తుయేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను.
11 ఈ మాట నమ్మదగినది, ఏదనగా - మననాయనతోకూడ చనిపోయినవారమైతే ఆయనతోకూడ బ్రదుకుదుము.
12 సహించినవారమైతే ఆయనతోకూడ ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన యెరుగననును.
13 మనము నమ్మదగనివారమైననుఆయన నమ్మదగినవాడుగా ఉండును; ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు.
14 వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరానిమాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకముచేయుము.
15 దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగానునిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము.
16 అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి (మాటలాడు) వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు.
17-18. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు; వారు - పునరుత్ధానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.
19 అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. - ప్రభువు తనవారిని ఎరుగునుఅనునదియు - ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడునుదుర్ణీతినుండి తొలగిపోవలెనుఅనునదియు దానికి ముద్రగా ఉన్నది.
20 గొప్ప యింటిలో వెండి పాత్రలును మాత్రమే గాక కర్రవి మంటివి కూడ ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును.
21 ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనినయెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును.
22 నీవు యౌవనేచ్ఛలను విసర్జించి, 5పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారితో కూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. 6
23 నేర్పులేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించునని యెరిగి అట్టివాటిని విసర్జించుము.
24-26. సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై దేవుడొకవేళ ఎదురాడు వారికి మారుమనస్సు దయచేయును; అందువలన సాతాను తన యిష్టము నెరవేర్చుటకై చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభువుయొక్క దాసుడు అట్టివారిని సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరియెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించువాడుగాను ఉండవలెను.

No comments:
Post a Comment