1 దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షముతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
2 వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన, దీర్ఘశాంతముతోను ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.
3 ఎందుకనగా జనులు హితబోధనుసహింపక దురద చెవులుగల వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,
4 సత్యమునకు చెవి ఇయ్యక కల్పనాకథలవైపుకు తిరుగుకాలము వచ్చును.
5 అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.
6 నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నా నిర్యాణ కాలముసమీపమైయున్నది.
7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.
8 ఇకమీదట నా కొరకు నీతికిరీటముంచబడియున్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును, నాకుమాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును.
9 నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము.
10 దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలోనీకేకు వెళ్లెను, క్రేస్కే గలతీయుకును తీతు దల్మతియకును వెళ్లిరి;
11 లూకామాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసుకు పంపితిని.
12-13. నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
14 అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడు చేసెను, అతని క్రియలచొప్పున ప్రభువతనికి ప్రతిఫలమిచ్చును;
15 అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను.
16 నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరు నన్ను విడిచి పోయిరి; యిది వారికి నేరముగా ఎంచబడకుండును గాక.
17 అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్యజనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా పక్షమున ఉండినన్ను బలపరచెను గనుక నేను సింహమునోటనుండి తప్పింపబడితిని.
18 ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించి తన పరలోకరాజ్యమునుకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్.
19 ప్రిస్కకును అకులకును ఒనేసిఫొరు ఇంటివారికిని నా వందనములు.
20 ఎరస్తు కొరింథిలో నిలిచిపోయెను. త్రోపిము రోగియైనందున అతని మిలేతులో విడిచివచ్చితిని.
21 శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నముచేయుము. యుబూలు, పుదే, లీను క్లౌదియయు సహోదరులందరును నీకు వందనములు చెప్పుచునన్నారు.
22 ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక. కృప మీకు తోడైయుండును గాక.

No comments:
Post a Comment